ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సీనియర్ దర్శకులకు మాత్రమే వరుస అవకాశాలిస్తూ వెళ్లారు.ఆతరువాత దర్శకుల విషయం లో సూపర్ స్టార్ట్ సెపరేట్ రూట్ లో వెళ్తూ యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. హిట్ ప్లాప్ లెక్క చేయకుండా యువ దర్శకులను ప్రోత్సహించారు. వాళ్లంతా కూడా తనని మరింత కొత్తగా చూపిస్తూ ఉండటంతో, యువ దర్శకులతో కలిసి పనిచేయడానికే ఆయన ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారు.
ఈ తరహాలో రజిని నెల్సన్ కి తన 169 వ చిత్రానికి అవకాశం ఇచ్చారు ఈమూవీని .. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రీసెంట్ గా తలపతి విజయ్ బీస్ట్ ప్లాప్ అవ్వడంతో రజనీకాంత్ తో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ సినిమా పై రోజుకో రూమర్ వినిపిస్తుంది. అయితే ఈసినిమా కాన్సిల్ అవ్వలేదు అని. త్వరలో స్టార్ట్ అవుతుందంటూ నెల్సన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నెల్సన్ ను పక్కన పెట్టకుండా.. ఆయన మీద నమ్మకంతో సన్ పిక్చర్స్ వారు ఈ సినిమా చేస్తున్నారు.
ఇక ఈసినిమా కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రజనీ తో పాటు మరో కీలకమైన పాత్రను ఒక యంగ్ హీరో చేస్తే బాగుంటుందని అనుకున్నారట. దాంతో తమిళ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ను సంప్రదించారట. గతంలో ఆయనకి డాక్టర్ సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ హిట్ ఇచ్చాడు . 100 కోట్ల క్లబ్ లో చేరిన ఆ సినిమాకి శివకార్తికేయన్ నిర్మాత కూడా.మరో వైపు రజనీ కాంత్ కూడా శివకార్తికేయన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతే కాదు స్వయంగా ఈ విషయంలో ఆయన యంగ్ హీరోతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ ఆగాల్సిందే.