
Sivakarthikeyan remuneration:
తమిళ స్టార్ శివకార్తికేయన్ కెరీర్‌లో ఓ కీలక మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. ‘అమరన్’ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో, తన కొత్త సినిమా ‘పరాశక్తి’ కోసం కొత్త రీతిలో రెమ్యునరేషన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. సాధారణంగా హీరోలు ముందుగానే రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుని తీసుకుంటారు. కానీ శివకార్తికేయన్ మాత్రం ‘పరాశక్తి’ సినిమాకు లాభాల్లో వాటా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
‘అమరన్’ 100 రోజులకు పైగా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమా సక్సెస్‌తో శివకార్తికేయన్ మార్కెట్ రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’లో నటిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కరైకుడిలో ప్రారంభమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివకార్తికేయన్ ముందుగా పారితోషికం తీసుకోకుండా, ప్రాఫిట్‌లో వాటా కోరడం కోలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
View this post on Instagram
ఇలాంటి మోడల్ హాలీవుడ్, బాలీవుడ్‌లో చాలా మంది ఫాలో అవుతున్నారు. టాలీవుడ్‌లో కూడా మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు లాభాల్లో వాటాలు తీసుకోవడం తెలిసిందే. అయితే శివకార్తికేయన్ కెరీర్‌లో మాత్రం ఇది ఫస్ట్ టైం. దీనివల్ల సినిమా బడ్జెట్‌పై ఎటువంటి బరువు పడకుండా, లాభాల్లో హీరోకు పెద్ద మొత్తంలో వంతం వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ సినిమాలో జయం రవి విలన్‌గా, అథర్వ కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్‌గా శ్రీలీల ఎంపిక కాగా, ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మరి ‘పరాశక్తి’ విజయవంతమైతే, శివకార్తికేయన్ రెమ్యునరేషన్ మోడల్ మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.