మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్‌గా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బన్నీ కెరియర్ లోనే మైలు రాయిగా నిలిచింది. అటు సంక్రాంతి విన్నర్.. ఇటు నాన్ ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బద్దలు కొట్టేసింది. తెలుగులో హిట్టయిన సినిమాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులు ముఖ్యంగా కరణ్ జోహర్ లాంటి వారు ముందు వరుసలో ఉంటారు. ‘అల వైకుంఠపురములో..’ సినిమాకు సంబంధించి రీమేక్ రైట్స్‌ను బాలీవుడ్ మేకర్ అశ్విన్ వర్దే కొనేశారని.. అక్షయ్ కుమార్‌ను హీరోగా పెట్టి తెరకెక్కిస్తారని టాక్ నడుస్తోంది. ఇంకోవైపు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. తమిళంలో ఈ చిత్రాన్ని శివకార్తికేయన్ హీరోగా రీమేక్ చేయనున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఈ రీమేక్
పై ఓ క్లారిటీ రానుంది.