HomeTelugu Trendingఅయలాన్‌లో ఏలియన్ పాత్రకు డబ్బింగ్ చెప్పనున్న సిద్దార్థ్‌

అయలాన్‌లో ఏలియన్ పాత్రకు డబ్బింగ్ చెప్పనున్న సిద్దార్థ్‌

sivakarthikeyan ayalaan mov

కోలీవుడ్‌ హీరో శివ‌కార్తికేయ‌న్ హీరోగా నటిస్తున్న తాజా ప్రాజెక్ట్‌ అయలాన్. ఆర్‌ రవికుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో శివకార్తికేయన్‌ గగనంలో విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్‌ కూడా వెళుతోంది. ఈ సినిమా పొంగళ్‌ 2024 కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారని తెలిసిందే.

విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యలో మేకర్స్ ప్రమోషనల్ ఈవెంట్స్‌పై ఫోకస్ పెట్టారు.. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఏలియన్ పాత్ర కోసం హీరో సిద్దార్థ్‌ వాయిస్ ఓవర్ అందిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ శివ‌కార్తికేయ‌న్ డిఫరెంట్‌ అవతార్‌లో కనిపించబోతున్నాడు.

మ్యూజిక్‌ సెన్సేషన్‌, ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో అయలాన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో శరద్‌ కేల్కర్‌, ఇషా కొప్పికర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌, బాల శరవణన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివకార్తికేయన్ మరోవైపు రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. SK21గా వస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్ రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu