తమిళ స్టార్హీరో ధనుష్కి కూడా బెదిరింపులు వస్తున్నాయట. తాజాగా ధనుష్ నటిస్తున్న సినిమా తమ మనోభావాలు దెబ్బతీసేలా తెరకెక్కిస్తున్నారని సినిమాను ఆపకపోతే హీరోని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి.
ధనుష్ నటిస్తున్న కర్ణన్ చిత్రంపై ప్రస్తుతం వివాదం రాజుకుంటుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వి.క్రియేషన్స్పై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఒక వర్గం వారు విమర్శలు గుప్పిస్తున్నారు. తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈచిత్రం ఉండబోతుంది అంటూ ఆందోళన చేస్తున్నారు. టైటిల్ విషయమై శివాజీ గణేశన్ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక 1999లో జరిగిన కొడియాంగుళం మణిమచ్చి జాతి ఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుందని.. పులిప్పడై సామాజిక వర్గాన్ని ఈచిత్రంలో తప్పుగా చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఆ వర్గానికి చెందిన ఒక యువకుడు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. తమ వర్గం గురించి తప్పుగా చూపిస్తే ధనుష్ తల నరుకుతా అంటూ ఆ వీడియోలో బెదిరింపులు చేశాడట.