టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార గురించి తెలసిందే. తండ్రికి తగ్గ కుతూరిగా దూసుకుపోతుంది ఈ అమ్మడు. అప్పుడే ఒక పెద్ద సెలెబ్రిటీ స్టేటస్ ను, సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించింది.
ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు దాదాపు 1 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇక ఇటీవలే సితార ఒక జ్యువెలరీ కంపెనీ కమర్షియల్ యాడ్ లో నటించిన సంగతి తెలసిందే. ఈ యాడ్ ను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లోని బిల్ బోర్డుపై కూడా ప్రదర్శించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలో ఈ యాడ్ కు సితార ఎంత రెమ్యునరేషన్ పై నెట్టింట చర్చ కూడా జరుగుతోంది. సదరు జ్యువెలరీ సంస్థ సితారకు కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చిందని టాక్. ఫస్ట్ యాడ్కే ఇంత తీసుకుంది అంటే ఇక ఫ్యూచర్లో సితార త్రండిని మించిపోతుందేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చాలా మంది హీరోయిన్లకు కూడా ఇంత రెమ్యునరేషన్ ఉండదనే విషయం తెలిసిందే.