సూపర్ స్టార్ మహేష్‌బాబు కుమార్తె సితార మరోసారి అభిమానుల మనసులు దోచుకుంది. తాజాగా ఈ చిన్నారి ‘మహర్షి’ సినిమాలోని ‘పాలపిట్ట’ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఉఫ్.. నువ్వు ఎంత చక్కగా ఉన్నావో. నేను ప్రతిరోజు సంతోషంతో నవ్వడానికి నువ్వు కారణం అవుతున్నావు’ అని ఆమె తన ముద్దుల కుమార్తెను ఉద్దేశించి పేర్కొన్నారు. వీడియోలో చిన్నారి ఉత్సాహంగా స్టెప్పులు వేసిన విధానానికి నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ‘ఫ్యూచర్ సూపర్‌స్టార్, సూపర్ సితార, వీడియో షేర్ చేసినందుకు థాంక్స్ నమ్రత, ఓ మై గాడ్ తన ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయి..’ అంటూ తెగ కామెంట్లు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.కాగా తాజాగా సితార తన స్నేహితురాలు, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి ఇటీవల సొంతంగా యూట్యూబ్‌లో A&S పేరుతో ఛానల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.