సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘షీ ఈజ్ సో క్యూట్..’ పాటకు ముద్దు ముద్దుగా డ్యాన్స్ చేసింది. హీరోయిన్ రష్మిక స్టెప్పులు కాపీ చేసి.. అచ్చం అలానే వేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పాప డ్యాన్సింగ్ నైపుణ్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
సితార ఇలా సినిమా పాటలకు డ్యాన్స్ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో ‘బాహుబలి’ లోని ‘ముకుంద..’, ‘మహర్షి’ సినిమాలోని ‘పాటపిట్ట..’ పాటలకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. అప్పట్లో మహేష్ తన ముద్దుల కుమార్తె డ్యాన్స్ చూసి మెచ్చుకున్నారు. మరోపక్క నాలుగు రోజుల క్రితం విడుదలైన ‘హీ ఈజ్ సో క్యూట్’ పాటకు యూట్యూబ్‌లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. 93 లక్షల మందికిపైగా ఈ పాటను వీక్షించారు. అంతేకాదు యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఏడో స్థానంలో ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను మధు ప్రియ ఆలపించారు.
#Sitara Dance For #HeIsSoCute Song ❤️ @ThisIsDSP 😍#SarileruNeekevvaru #SarileruNeekevvaruOnJan11th @urstrulyMahesh @AnilRavipudi @iamRashmika @AnilSunkara1 @ramjowrites @vijayashanthi_m @shreyasgroup @SVC_official @GMBents @SLNTheFilm pic.twitter.com/lBCfof5rGy
— #SarileruNeekevvaru (@AravindDhfm) December 20, 2019