తమిళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. ఈ సినిమా తాజాగాప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. తాజాగా ఈ సినిమాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ తనదైన స్టైల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన తెలుగులో నటించిన చిత్రం ‘సీతా రామం’.
దుల్కర్ సల్మాన్, మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వచ్చింది. వెండితెరపై అలానే ఇటు బుల్లితెరపై సీతారామం కూడా ఆడియన్స్ మనసు దోచుకుని తన సత్తా చాటింది. అయితే తాజాగా ఈ సినిమా మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. ఈ సినిమాలో ప్రతీ ఒక్కరి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఈ సినిమాని ఫుల్ రొమాంటిక్ మూవీగా టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించాడు. ఈ సినిమా దాదా సాహెబ్ ఫాల్కే 13వ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం – జ్యూరీ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికైంది. ఈ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ సినిమాలో రష్మిక మందన్న, సుమంత్, భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిషించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు