యువ నటుడు శర్వానంద్ హీరోగా నటిస్తున్న’రణరంగం’ సినిమాలోనుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. అది పెళ్ళికి సంబంధించిన సాంగ్. సీతా కళ్యాణ వైభోగమే అనే టైటిల్ తో సాగే ఈ సాంగ్ వినసొంపుగా ఉన్నది. చిన్న చిన్న పదాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. పెళ్లితో పాటు పెళ్లి తరువాత జరిగే తంతు గురించి కూడా ఈ సాంగ్ లో వివరించడం విశేషం. ఈ చిత్రానికి సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.