HomeTelugu Trendingసిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడి ఎంగేజ్‌మెంట్

సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడి ఎంగేజ్‌మెంట్

Sirivennela sitarama sastry

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన వేడుకలను కరోనా మహమ్మారి నేపథ్యంలో సింపుల్‌ చేసుకోవాల్సి వస్తోంది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు లేక సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టాలీవుడ్‌లోని బ్యాచిలర్స్ ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్, రానా పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివాళ్లు అయ్యారు. నిహారిక కూడా నిశ్చితార్థం పూర్తయింది. పెళ్లి ముహూర్తం కోసం ఎదురుచూస్తోంది. తాజాగా మరో నటుడు, ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు చెంబోలు రాజా కూడా తన ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది నా జీవితంలో ముఖ్యమైన రోజు. కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా, మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృత‌జ్ఞత‌లు అంటున్నాడు.

చెంబోలు రాజా అంతరిక్షం, ఎవడు, హ్యాపీ వెడ్డింగ్, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఫిదా, రణరంగం, మిస్టర్ మజ్ను, ఏబీసీడీ’ వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇందులో ఫిదా సినిమా మంచి పేరును తెచ్చింది. చెంబోలు రాజా ఇప్పుడు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నాడు ఆయ‌న చివ‌రిసారిగా భానుమ‌తి రామ‌కృష్ణ మూవీలో న‌టించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu