HomeTelugu Big Storiesసిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు

Sirivennela sitarama sastry 1

తెలుగు సినీ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు (మంగళవారం) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాధ చాయలు అలముకున్నాయి.

Sirivennela 1

1986లో సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా తెలుగు తెరపై అడుగు పెట్టారు సీతారామశాస్త్రి . కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున’ గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. దాదాపు 800లకు చిత్రాల్లో 3వేలకు పైగా పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి.11సార్లు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. 2019లో భారతదేశ పురస్కారం పద్మశ్రీ లభించింది. స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాట లిరిక్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Sirivennela Seetharama Sastry Health Bulletin

చెంబోలు సీతారామశాస్త్రి 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్‌.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. దిగువ మధ్య తరగతి కుటుంబం. పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్‌, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో బి.ఎ.పూర్తి చేశారు. అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేకపోవడంతో ఎంబీబీఎస్‌ చేయమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. కానీ, ఆ క్రమశిక్షణ తనకు అలవాటు లేకపోవడంతో అంతగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో 10వ తరగతి అర్హతపై బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావటంతో రాజమహేంద్రవరంలో కొన్నాళ్లు పనిచేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu