ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయన హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు లోనైన ఆయనను కిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని.. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని కుటుంబ సభ్యులు అన్నారు.