ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ‘టాలీవుడ్ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబరు 24న ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటిప్పుడు పరిశీలిస్తున్నారు. ఐసీయూలో ఉన్న సీతారామశాస్త్రి త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్యం పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం’ అని కిమ్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీతారామశాస్త్రి గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.