మెగాస్టార్ చిరంజీవి నటించిన చరిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ పొందుతూ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ ఆనందాన్ని, అనుభవాలను పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ సైరా విజయం ఒక కళాత్మక, చరిత్రాత్మక, అవసరమైన విజయంగా అభివర్ణించారు. జాతిని నడిపించే ఇలాంటి కథలను సృష్టించాలని కథా రచయితలను కోరుతున్నాను అన్నారు. చిరంజీవి నుంచి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన చిత్రాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను అన్నారు. వినోదం ఎవరైనా పంచగలరేమో కానీ, వికాసం అందరూ ఇవ్వలేరు. అలాంటి కొద్దిమంది నటుల్లో చిరంజీవి ఒక్కరు అని అన్నారు.