HomeTelugu Newsసినిమా రంగంపై సిరివెన్నెల అభిప్రాయం

సినిమా రంగంపై సిరివెన్నెల అభిప్రాయం

12 19
సినిమా రంగాన్ని తాను దేవాలయం కంటే మిన్నగా ఆరాధిస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు. సినిమాల వల్ల సమాజం ఎప్పుడూ చెడిపోదని.. సమాజానికి సినిమా అద్దం లాంటిదని పేర్కొన్నారు. సిరివెన్నెలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో తెలుగు చలన చిత్ర (టాలీవుడ్)
మీడియా ప్రతినిధులు గురువారం సాయంత్రం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిరివెన్నెల హాజరై, ప్రసంగించారు.

సినీ సాహిత్యమనే వ్యవసాయంలో తనకు లభించిన ఫలసాయం పద్మశ్రీ పురస్కారమని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. పద్మశ్రీ పురస్కారానికి తన పేరు సూచించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు పద్మశ్రీ రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆకాంక్షించారని తెలిపారు. ఈ సందర్భంగా తన పాటల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సిరివెన్నెల.. పదాల కూర్పు, రచయితల శైలి మారినప్పుడే సినీరంగంలో చక్కటి పాటలు వస్తాయని సూచించారు. కేంద్రం తనకు పద్మశ్రీ పురస్కారాన్ని మాత్రమే ప్రకటించిందని.. పద్మశ్రీ తనకు బిరుదు కాదని స్పష్టం చేసిన సిరివెన్నెల సభికుల హృదయాలను గెలుచుకున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu