HomeTelugu Big Stories'సార్‌' ట్రైలర్‌ విడుదల

‘సార్‌’ ట్రైలర్‌ విడుదల

SIR movie Trailerకోలీవుడ్‌ హీరో ధనుశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ – సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో రూపొందింది. తమిళంలో ఈ సినిమా ‘వాతి’ టైటిల్ తో విడుదల కానుంది.

కొంతసేపటి క్రితం తెలుగు వెర్షన్ కి సంబధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలోని పరిస్థితులపై .. అందుకు కారకులవుతున్న వారిపై ఒక లెక్చరర్ తిరుగుబాటునే ఈ కథ. కొంతమందికి మాత్రమే ఉన్నత విద్య అందుబాటులో ఉండటం పట్ల అతను చూపించే ఆవేశమే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు.

కొన్ని డైలాగ్స్ ట్రైలర్ లో హైలైట్ గా కనిపిస్తున్నాయి. సముద్రఖని, ‘ఆడుకాలం’ నరేన్, సాయికుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu