కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్.. తెలుగు నేరుగా చేస్తున్న చిత్రం ‘సార్’. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమా విద్యా వ్యవస్థలోని లోపాలపై నడవనుంది. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన చేస్తూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. క్లాస్ రూమ్ కి సంధించిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ అలరించనుంది.
సితార .. త్రివిక్రమ్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను అదే రోజున విడుదల చేయనున్నారు.