టాలీవుడ్ సింగర్ సునీత తన తనయుడు ఆకాష్ ని హీరోగా పరిచయం చేస్తోంది. ఈ సినిమాకి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్.కె. టెలీషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఆయన ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘సర్కారు నౌకరి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ మూవీ ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలని సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సినిమాతో భావనా వళపండల్ టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తవు సన్నివేశానికి జీ స్టూడియోస్ నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విఛాన్ చేశారు.
దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు దేవుడి పటాలపై క్లాప్ నిచ్చారు. మ్యాంగో మీడియా అధినేత గాయని సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం హీరో హీరోయిన్ లపై చిత్రీకరించిన తొలి షాట్ కు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా గాయని సునీత కెమెరా స్విఛాన్ చేశారు. ఈ చిత్రంలో ఆకాష్ భావనా వళపండల, తనికెళ్ల భరణి, సూర్యసాయి, శ్రీనివాస్, పొందూరి త్రినాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.