HomeTelugu Trendingమీకు దండం రా నాయనా - ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత

మీకు దండం రా నాయనా – ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత

Singer Sunitha React On Pregnancy Rumours

సింగర్‌ సునీత ఏడాది క్రితం రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని హ్యాపీగా గడుపుతోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సునీత తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది. తాజాగా ఆమె మామిడి కాయలను పట్టుకున్న ఫోటో ను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. దీంతో ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ నెట్టింట జోరుగా చర్చ మొదలైంది. అయితే నిజానికి అలాంటిదేమీ లేదని తెలిసింది.

తాజాగా ఈ పుకార్లను ఖండిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ చేసింది సునీత. ‘నేనేదో సరదాకి పోస్ట్ పెడితే ఇలా క్రేజీ రూమార్లు పుట్టిస్తున్నారు దేవుడా.. నేను ఈరోజు నా మొదటి మామిడి కాయలతో ఫోటో దిగి పోస్ట్‌ చేస్తే ఏదేదో ఊహించుకొని రాసేశారు. ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయని అనుకోలేదు. మీకు దండం రా నాయనా… అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. దీంతో సునీత ప్రెగ్నెంట్‌ అంటూ వస్తోన్న వార్తలను చెక్‌ పెట్టినట్లయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

Recent Articles English

Gallery

Recent Articles Telugu