సింగర్ సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సునీత తన ఇంస్టాగ్రమ్లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటో చూస్తుంటే ఎక్కడికో వెకేషన్‌గా వెళ్లినట్లు అనిపిస్తుంది. నేడు ప్రేమికుల రోజు సందర్భంగా సునీత వెకేషన్‌కు వెళ్లింది అంటున్నారు. ఈ ఫొటోలో బ్యాక్‌గ్రౌండ్ చూసి సునీత మాల్దీవులకు వెళ్లారని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. అయితే అసలు సునీత మాల్దీవులకు వెళ్లారా లేదా అనేది మాత్రం తెలీదు. మరి ఈ విషయంలో సునీత స్వయంగా క్లారీటీ ఇవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.