సింగర్ సునీత పెళ్ళి కూతురుగా ముస్తాబవుతోంది. బిజినెస్‌మెన్ రామ్ వీరపనేనితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు జనవరి -9న సునీత వివాహం జరగనున్నట్లు ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఇంట మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలను ఆమె స్నేహితురాలు, నటి రేణూ దేశాయ్ శుక్రవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో అభిమానులు సునీతకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఈ వీడియోలో పసుపు చీరలో మెరిసిపోతున్న సునీత ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫంక్షన్‌కు యాంకర్ సుమ కూడా హాజరయ్యారు. కాగా గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో సునీత-రామ్ ఓ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సునీతకు కాబోయే భర్త రామ్‌కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో సదరు హీరోనే దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం.
View this post on Instagram