సింగర్ సునీత వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని ఆమె రెండో వివాహం చేసుకోబోతున్నట్లు.. ఈ రోజు ఉదయం నిశ్చితార్ధం జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ప్రతి తల్లి మాదిరే తాను కూడా తన పిల్లలను మంచిగా సెటిల్ చేయాలనే కలలు కన్నానని సునీత చెప్పారు. ఆ క్షణం ఇప్పుడు వచ్చిందని… తన జీవితంలో రామ్ ప్రవేశించాడని తెలిపారు. రామ్ ఒక మంచి స్నేహితుడే కాదు… ఒక మంచి భాగస్వామి కూడా అని అన్నారు. వైవాహిక బంధంతో తామిద్దరం ఒకటి కాబోతున్న తరుణంలో చాలా ఆనందంగా ఉన్నామని చెప్పారు. త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితాన్ని అర్థం చేసుకున్న అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ఇంతకాలం మీరు అందించిన ప్రేమాభిమానాలను ఇకపై కూడా అందిస్తారని ఆశిస్తున్నానని సునీత అన్నారు.