టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఇటీవల రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన పిల్లల ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. తన భర్త రామ్ చాలా మంచివారు.. ఆయనతో తన మిగిలిన జీవితం అని చెప్పింది. తాజాగా సునీత తన భర్తతో కలిసి మాల్దీవులకు హనీమూన్ కి వెళ్లారు. అక్కడి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.