సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో సునీత వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవలే జరిగింది. అయితే తాజాగా సునీత తన పెళ్లి విషయమై మాట్లాడింది. హైదరాబాద్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం అతిథులుగా హాజరైన సింగర్ సునీత, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, రాశీఖన్నా సందడి చేశారు. సింగర్ సునీత మాట్లాడుతూ.. ఈ షాపింగ్ మాల్ లోకి వస్తుంటే టెంపుల్ లోకి వచ్చిన అనుభూతి కలుగుతోందన్నారు. పట్టుచీరలు అద్భుతంగా ఉన్నాయన్నారు. చీరకట్టులో అణుకువ వుంది, ఆడతనం ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి విషయమై మాట్లాడుతూ.. ‘నా వెడ్డింగ్ అని కాదు, రెండు ఫ్యామిలీస్ కలుస్తున్నాయి’ అని సునీత చాలా సున్నితంగా స్పందించారు. ‘జనవరిలో పెళ్లి వుండొచ్చా..?’ అనే ప్రశ్నకు.. సునీత నవ్వుతూ, ‘ఉండొచ్చండి’ అంటూ సమాధానం ఇచ్చింది.