కాగా బాలు కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన కోలుకోవాలని సెలబ్రెటీలు , సంగీత ప్రేమికులు దేవుడిని ప్రార్దిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు ఎంజీఎం వైప్రముఖ గాయకుడు ఎస్పీ సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతోంది. చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో ఎక్మో సహయంతో చికిత్స అందుతోంది. కాగా.. బాలుకు నెగిటివ్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. బాలు కు కరోనా నెగిటివ్ రాలేదని . ఆయన ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారని ఎస్పీ చరణ్ అన్నారు. “మా నాన్న ఆరోగ్యం పై నాకే సమాచారం వస్తుంది. నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయన ఆరోగ్యం పై వస్తున్న వదంతులు నమ్మకండి అని చరణ్ పేర్కొన్నారు.