HomeTelugu Trendingఐసీయూలో ఎస్పీ బాలు

ఐసీయూలో ఎస్పీ బాలు

SP Balasubrahmanyam in ICUప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం‌ ఆరోగ్యం క్షీణించడంతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అయితే గత రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన హెల్త్ కండిషన్‌పై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బాలు శ్వాస తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా.. తనకు కరోనా వచ్చిందని విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు ఎస్పీ బాలు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, దయచేసి ఎవరూ ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టొదని వీడియో విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu