ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. సింగపూర్ బయలుదేరిన శ్రేయ .. తనతో పాటు ఓ వాయిద్య పరికరాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ ఇందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఒప్పుకోలేదు. పరికరాన్ని విమానంలోకి తీసుకురాకూడదని చెప్పారు. దాంతో తప్పని పరిస్థితుల్లో శ్రేయ తన పరికరాన్ని విమానాశ్రయంలోనే వదిలేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్ ద్వారా సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ మ్యుజీషియన్స్ వద్ద విలువైన వాయిద్య పరికరాలుంటే విమానంలోకి ఎక్కనివ్వదేమో..! మంచిది. ధన్యవాదాలు. నాకు గుణపాఠం చెప్పారు. అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన ఎయిర్‌లైన్స్ సంస్థ శ్రేయకు క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై శ్రేయకు అభిమానుల నుంచి మద్దతు లభించింది. విషయం ఎంతో సీరియస్ అయితే కానీ ఆమె ఇలా ట్వీట్ చేయరంటూ ఎయిర్‌లైన్స్‌పై కామెంట్లు చేస్తున్నారు.