HomeTelugu Trendingతల్లికాబోతున్న శ్రేయాఘోషల్

తల్లికాబోతున్న శ్రేయాఘోషల్

Shreya Ghosal2
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఎన్నో భాషల్లో అద్భుత పాటలను ఆలపించిన సమధుర గాయని శ్రేయా ఘోషల్ అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు. తన స్వరంతో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు శ్రేయా. ఆరేళ్ల క్రితం తన మిత్రుడు శైలాదిత్యను వివాహం చేసుకున్న శ్రేయా ఇప్పటికి తన అభిమానులకు ఓ శుభవార్త వినిపించింది. తాను తల్లికాబోతున్నానంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బేబీ శ్రేయాదిత్య కమింగ్ అంటూ బేబీ బంప్‌తో ఉన్న ఫొటో అభిమానులతో పంచుకున్నారు. జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నాను ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu