HomeTelugu Trendingసింగర్‌ మనోకు అరుదైన గౌరవం

సింగర్‌ మనోకు అరుదైన గౌరవం

singer mano honoured with d

సింగర్‌ మనో గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతోపాటు తులు, కొంకణి, అస్సామీ భాషల్లో పాటలు పాడి సంగీత ప్రపంచంలో తనకంటూ స్పెషల్ రికార్డును క్రియేట్‌ చేశారు. దశాబ్దాలుగా అన్ని భాషల ప్రేక్షకులను తన పాటలతో మైమరింపజేస్తున్న మనో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

రిచ్‌మండ్‌ గ్యాబ్రియల్‌ (టొరంటో) యూనివర్సిటీ సంగీత ప్రపంచంలో చేసిన సేవలకుగాను మనోకు గౌరవ డాక్టరేట్‌ ను ప్రదానం చేసింది. ఇండియన్ మ్యూజికల్ ఇండస్ట్రీలో 38 ఏండ్ల ప్రయాణంలో సింగర్‌గా‌, మ్యాజిషియన్‌గా 15 భారతీయ భాషల్లో 25వేలకుపైగా పాటలు పాడిన మనో డాక్టరేట్‌ అందుకున్న సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు.

ఎల్లప్పుడూ మీరందరూ అందించిన మద్దతు, ప్రేమకు కృతజ్ఞుడిని. చాలా గౌరవప్రదంగా ఉంది.. అంటూ ట్వీట్ చేశారు మనో. ట్వీట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మనో డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పాపులర్‌ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన దాదాపు అన్నీ సినిమాల (తెలుగులో) కు మనో వాయిస్‌ ఓవర్‌ అందించారు.

మరోవైపు కమల్‌ హాసన్‌ నటించిన పలు తెలుగు చిత్రాలకు కూడా వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. నటుడిగా కూడా పలు చిత్రాల్లో కనిపించారు మనో. ప్రస్తుతం తమిళంలో ఓ మ్యూజికల్ టాక్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu