లెజెండరీ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా ఈ నెల 5న చెన్నై ఎంజీఎం హాస్పిటల్లోచేరారు. ఆయనతో పాటుగా టాలీవుడ్ సింగర్స్ సునీత, మాళవిక కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారు ఓ టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అందులోనే వారికి కరోనా సోకినట్టుగా సమాచారం. అయితే మాళవిక కారణంగానే ఎస్పీబీకి కరోనా సోకింది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయం పై స్పందించిన మాళవిక … ఎస్పీబీకి ఈ నెల 5న కరోనా సోకింది. కానీ నాకు ఈ వైరస్ సోకినట్లు ఈ నెల 8 న తెలిసింది. కాబట్టి నా వల్ల ఆయనకు కరోనా సోకింది అనేది అసత్య ప్రచారం అని తెలిపింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న మాళవిక.. తనతో పాటు తన రెండేళ్ల కూతురికి, తల్లిదండ్రులకి కూడా కరోనా సోకినట్టు తెలిపిన సంగతి తెలిసిందే.