HomeTelugu Big Storiesబాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ 'కేకే' హఠాన్మరణం

బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ ‘కేకే’ హఠాన్మరణం

Singer kk died after concer
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. అనంతరం ఆయన అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయనను సీఎంఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కేకే మరణించినట్టు ధ్రువీకరించారు.

1990లలో ‘పాల్’, ‘యారోన్’ సినిమాల్లో ఆయన పాడిన పాటలు సంచలనం సృష్టించాయి. యువతలో ఆయన పాటలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. స్కూల్, కాలేజీ, కల్చరల్ ఈవెంట్స్‌లో ఎక్కువగా ఈ పాటలు వినిపించేవి. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ సహా పలు భాషల్లోనూ పాటలు పాడారు.

కేకే మరణవార్త ఆయన అభిమానులను, ప్రముఖులు, సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కేకే మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పాటలు అన్ని రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయని, అన్ని వయసుల వారిని అలరిస్తాయని అన్నారు. ఆయన పాటల ద్వారా ఎప్పటికీ కేకేను గుర్తుంచుకుంటామని అన్నారు. కేకే కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

https://www.instagram.com/p/CeNsAUvotzV/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu