స్టార్ సింగర్ అద్నాన్ సమీ.. తనపై కామెంట్లు చేస్తున్న పాకిస్థానీ నెటిజన్లకు దీటైన జవాబిచ్చారు. పాకిస్థాన్లో పుట్టిన సమీ.. కొన్నేళ్ల క్రితం భారత పౌరసత్వం తీసుకున్నారు. ఇటీవల భారత వైమానిక దళం.. పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో సమీ భారత్కు మద్దతిస్తూ… ‘భారత వైమానిక దళం పట్ల ఎంతో గర్వంగా ఉంది. ఉగ్రవాదాన్ని ఆపండి. జైహింద్’ అని ట్విటర్లో పేర్కొన్నారు. దాంతో పాకిస్థాన్లో పుట్టి.. భారత్కు మద్దతిస్తున్నారంటూ పలువురు పాకిస్థానీ నెటిజన్లు సమీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సమీ వారికి ట్విటర్ వేదికగా దీటైన సమాధానం ఇచ్చారు. ‘డియర్ పాక్ ట్రోల్స్.. ఇక్కడ మీ ఈగో విషయం కాదు. మీరు శత్రువులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరిపారేయడం ఇక్కడ విషయం. మీ నీచమైన మెంటాలిటీ పట్ల నవ్వొస్తోంది. మీరు అనే మాటలే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dear Pak trolls,
Its not about ur egos being given a reality check today; its about eliminating terrorists who u ‘claim’ r also ur enemies! Ur Ostrich mentality is laughable.Btw, ur abuses expose ur reality & therefore d only difference between u & a bucket of shit is the bucket!— Adnan Sami (@AdnanSamiLive) February 26, 2019