స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సైలెన్స్’. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తైంది. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే అనుష్క తన అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలోని తన లుక్‌ను కొద్దిగా రివీల్ చేస్తూ ఓ ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. పొట్టి జుట్టుతో చేతిలో పుస్తకం పట్టుకుని ఏదో రాస్తున్నట్లుగా అనుష్క లుక్ ఉంది. ‘త్వరలో స్పాట్‌లైన్‌లోకి వస్తాను’ అని స్వీటీ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంలో మాధవన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ మైఖెల్ మ్యాడసన్ కూడా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.