కోలీవుడ్ హీరో శింబు తండ్రి, నటుడు టి.రాజేందర్ అస్వస్థతకు లోనయ్యారు. మే 7న ఆయనకు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో అప్పటినుంచి ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ విషయం బయటకు పొక్కడంతో హీరో శింబు సోషల్ మీడియాలో తన తండ్రి ఆరోగ్యం గురించి ఓ లేఖ విడుదల చేశాడు. ‘మా తండ్రికి ఛాతీలో నొప్పి రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నాము. పొత్తికడుపులో రక్తస్రావం అవుతుండటంతో ఆయనకు ఇంకా మెరుగైన వైద్యం అవసరమని డాక్టర్లు చెప్పారు. వారి సూచన మేరకు విదేశానికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆయన బాగున్నారు. ట్రీట్‌మెంట్ పూర్తవగానే తిరిగొస్తాం. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అని శింబు రాసుకొచ్చాడు.
కాగా రాజేందర్ అనారోగ్యానికి గురి కావడంతో మొదట చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు వారాలు చికిత్స అందించిన తర్వాత పొరూర్‌లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడని పక్షంలో మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లారు.
— Silambarasan TR (@SilambarasanTR_) May 24, 2022