HomeTelugu Trendingమొదలైన 'సైమా' సందడి

మొదలైన ‘సైమా’ సందడి

siima celebrations to be he

దుబాయ్ వేదికగా సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ (సైమా) వేడుక జరగనుంది. దుబాయ్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రానా దగ్గుబాటి, హీరోయిన్లు నిధి అగర్వాల్‌, మీనాక్షి చౌదరి, సైమా ఛైర్‌ పర్సన్‌ బృందా ప్రసాద్‌, శశాంక్‌ శ్రీ వాస్తవ్‌ వివరాలు వెల్లడించారు.

ఈ సమావేశంలో రానా మాట్లాడుతూ.. ఈ వేడుకతో తనది 11 ఏళ్ల అనుబంధం అన్నాడు. గ్లోబల్‌ ప్లాట్‌ఫాంకి చేరువ అవడానికి సైమా గొప్ప వేదిక అని, ఇందులో భాగం కావడం చాలా ఆనందంగా ఉందన్నాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నీ కలసి ఆనందంగా జరుపుకొనే వేడుక ఇది అని చెప్పాడు. దిగ్గజ నటీనటులతో కలిసి సైమా వేదికను పంచుకోవడం గొప్ప ఆనందాన్ని ఇస్తుందని నిధి అగర్వాల్‌ చెప్పింది.

సైమా వేడుకల్లో పాల్గొనడం తనకు ఇదే మొదటి సారి అని, ఇందుకు చాలా ఉత్సాహంగా ఉందని మీనాక్షి చౌదరి తెలిపింది. సినిమాను ఒక పండగలా జరుపుకొనే వేడుక ఇదని అభిప్రాయపడింది. వేడుకలకు కౌంట్‌ డౌన్‌ మొదలయిందనీ సైమా ఛైర్‌ పర్సన్‌ బృందా ప్రసాద్‌ చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu