టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లూ’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్వ్కేర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అనుపమ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ మూవీ తర్వాత సిద్ధూకి ఆఫర్లు క్యూలు కడుతున్నాయి.
ఈ క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ తో సిద్ధూ ఓ మూవీ చేయనున్నట్లు టాక్. బొమ్మరిల్లు భాస్కర్ మూవీలకు మంచి క్రేజ్ ఉంది. పరుగు, ఆరెంజ్ సినిమాలు చేసిన చాలా కాలం తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో హిట్ కొట్టాడు. ఇప్పుడు సిద్ధు తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట.
ఇప్పటికే స్టోరీ వినిపించాడట. సిద్ధూకి కూడా నచ్చడంతో ఒకే చేసినట్లు తెలుస్తోంది. అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బాపినీడు, ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే లాంఛనంగా ఈ మూవీని ప్రారంభించనున్నారట. అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.