
Sidhu Jonnalagadda remuneration for Jack:
డీజే టిల్లుతో యూత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల లీగ్‌లోకి ఎంటర్ అయ్యాడు. టిల్లు స్క్వేర్ కూడా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ సినిమా “జాక్” ఎప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమాకి సిద్ధు ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట! మేకర్స్ అయిన బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒప్పుకున్నారంటే, ఆయన మీద ఉన్న నమ్మకం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంకా విడుదల కాకముందే జాక్ సినిమా బిజినెస్ బాగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.25 కోట్లకు రైట్స్ అమ్ముడయ్యాయి – నిజాంలో రూ.9 కోట్లు, ఆంధ్రా & సీడెడ్ కలిపి రూ.16 కోట్లు. ఒక యువ హీరో సినిమా ఇంత రేంజ్‌లో అమ్ముడవ్వడం అంటే, సిద్ధుకి మార్కెట్ ఎలా పెరిగిందో క్లియర్‌గా తెలుస్తోంది.
ఈ మూవీలో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. “బేబీ” సినిమా తర్వాత ఆమె కూడా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఆమె ఒక్క సినిమాకి రూ.1 కోటి తీసుకుంటున్నట్టు టాక్.
ప్రకాశ్ రాజ్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. మరో విశేషం ఏమిటంటే, జాక్ సినిమాని trilogyగా ప్లాన్ చేశారు. తర్వాతి భాగాలు “జాక్ ప్రో” & “జాక్ ప్రో మాక్స్” పేర్లతో రాబోతున్నాయి.
మ్యూజిక్ లో కూడా మంచి టీమ్ ఉంది – అచు రాజమణి, సామ్ CS, మరియు బొబ్బిలి సురేష్ కలిసి కంపోజ్ చేస్తున్నారు.
ఇంతటి హైప్‌తో విడుదలవుతున్న “జాక్” హిట్ అయితే, ఇది సిద్ధు హ్యాట్రిక్ హిట్ అవుతుంది. అప్పుడు ఆయన టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ ఫిక్స్!