HomeTelugu TrendingSiddu Jonnalagadda : 'జాక్‌'గా సిద్ధు జొన్నలగడ్డ

Siddu Jonnalagadda : ‘జాక్‌’గా సిద్ధు జొన్నలగడ్డ

Siddhu Jonnalagadda JACK Mo

Siddu Jonnalagadda :సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘డీజే టిల్లు’తో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు సిద్ధు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్స్‌లో బిజీగా ఉన్నాడు. దీంతో పాటుగా బొమ్మరిల్లు భాస్కర్‌తో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

SVCC 37 గా వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఈ రోజు సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ ప్రకటించారు. ఈ మూవీకి ‘జాక్’ అనే టైటిల్ ఫిక్స్‌ చేశారు. ఈ మూవీ టైట్‌ల్‌లో కొంచెం క్రాక్‌ అనేది ఉంది.

ఈ సినిమాలో కూడా సిద్ధు తన స్టైల్‌నే ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. ఇక ఈ పోస్ట‌ర్‌లో సిద్ధు గ‌న్స్ ప‌ట్టుకుని ఫుల్ యాక్ష‌న్ మోడ్‌లో క‌నిపిస్తున్నారు. ఈ సినిమా యాక్ష‌న్‌, క్రైమ్ జోనర్‌లో తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.

హ్యారిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చుతున్నట్లు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బేబి ఫేం వైష్ణవి హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu