
Siddhu Jonnalagadda remuneration:
సిద్ధూ జొన్నలగడ్డ ఇప్పుడు తన కొత్త సినిమా జాక్ రిలీజ్ కోసం ఫుల్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆయన ఒక ప్రముఖ మీడియా వెబ్ సైట్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా సరదాగా, ఓపెన్‌గా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో వచ్చిన కొన్ని పాయింట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
మొదటగా, జాక్ సినిమాకి సంబంధించి నిజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారని రూమర్లు వచ్చాయి. దీనిపై సిద్ధూ హాస్యంగా స్పందించాడు. “ఇంటర్నెట్‌లో నడిచే నంబర్లు వేరే లెవెల్లో ఉంటాయి. నిజం మాత్రం అంతలా ఉండదు” అంటూ చమత్కారంగా తిప్పికొట్టేశాడు.
ఇక మరో ఆసక్తికర విషయమేంటంటే, టిల్లు స్క్వేర్ సినిమా టైంలో తీసుకున్న రెమ్యూనరేషన్‌తో జాక్ సినిమాకి తీసుకున్న పారితోషికం మధ్య తేడా ఉందా? అన్న ప్రశ్నకి సిద్ధూ చాలా డిప్లొమాటిక్‌గా స్పందించాడు. “ఒక డిమాండ్ కాదు, టైమ్స్ మారాయి కాబట్టి పరిస్థితే వేరుగా మారింది,” అన్నాడు. అంటే ఇండస్ట్రీలో తన క్రేజ్ పెరిగిందని, మార్కెట్ మారిందని చక్కగా చెప్పేశాడు.
ఇంటర్వ్యూలో ఆయన చూపించిన హాస్యం, నిజాయితీ మరోసారి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. సినిమాల్లో మాత్రమే కాదు, ఇంటర్వ్యూలలో కూడా సిద్ధూ తన స్టైల్‌తో ఫ్రాంక్‌గా ఉండే వ్యక్తి అని మరోసారి ప్రూవ్ చేశాడు.
ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ అయితే జాక్ సినిమా రిలీజ్‌కి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా కూడా టిల్లు స్క్వేర్‌లాగే హిట్ అవుతుందేమో చూడాలి!
ALSO READ: Hari Hara Veera Mallu నిర్మాతలకి పెద్ద షాక్ ఇచ్చిన అమెజాన్