Mr Bachchan Teaser:
డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న సినిమా మిస్టర్ బచ్చన్. భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. అక్టోబర్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ప్రీ పోన్ అయ్యి ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతోంది. ఆగస్టు 14 న చిత్ర ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి.
ఈ సినిమా హిందీ లో అజయ్ దేవగన్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన రెయిడ్ అనే సినిమాకి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి ఇంట్లో జరిగే ఇన్కమ్ టాక్స్ రైడ్ చుట్టూ సినిమా కథ సాగుతుంది. రీమేక్ అయినా కూడా హరీష్ శంకర్ కథకు తనదైన శైలి లో మాస్ టచ్ ఇచ్చారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ సినిమాలో ఒక యువ హీరో కామియో పాత్రలో కనిపించబోతున్నారు. ఆ హీరో మరెవరో కాదు సిద్దు జొన్నలగడ్డ. గతంలో చిన్న చిన్న పాత్రలతో కనిపించిన సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో పాపులర్ అయ్యారు. ఈ మధ్యనే ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సిద్దు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్ సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాలో చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇవాల్టి నుంచి సిద్దు జొన్నలగడ్డ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. సినిమాలో సిద్దు పాత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్యాడ్‌బరీ యాడ్‌తో పాపులర్ అయిన భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సీనియర్ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో షాక్, మిరపకాయ్ సినిమాలతో మెప్పించిన రవి తేజ హరీష్ శంకర్ కాంబో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి. ఈ మధ్యనే విడుదలైన చిత్ర టీజర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.