Siddharth aditi rao hydari marriage: తమిళ్ హీరో సిద్ధార్ద్ సీక్రెట్‌గా హీరోయిన్ అదితి రావ్ హైదరిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. సిద్ధార్ద్, అదితిల వివాహం వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్‌లో బుధవారం (మార్చి 27న) ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగిన్నట్లు తెలుస్తుంది.
సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ సంబంధించిన వీడియోలు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలి వీరిద్దరూ జంటగా ఫంక్షన్స్‌కి, సినిమాలకి, పార్టీలకి కూడా వెళ్లారు. అయితే పెళ్లి గురించి అడగ్గా.. ఇద్దరు దాటవేస్తూ వచ్చారు. తాజాగా వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సిద్ధార్థ్‌కి ఇది రెండో పెళ్లి కాగా.. అదితికి కూడా రెండో వివాహమే.
2003లో మేఘన అనే యువతిని సిద్ధార్థ్ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో 2007లో విడిపోయాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అతడి బాధ్యతలను సిద్ధార్థ్ చూసుకుంటున్నాడు. అప్పటినుంచి మరో వివాహం చేసుకోలేదు గానీ.. చాలా మంది హీరోయిన్స్‌తో ఎఫైర్ నడిపాడు. సోహా అలీ ఖాన్, సమంత కూడా ఆ జాబితాలో ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.
చివరకు అదితిని వివాహం చేసుకున్నాడు. సిద్దార్థ్-అదితి కలిసి మహాసముద్రం చిత్రంలో నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. బాయ్స్, నువ్ వస్తానంటే నేను ఒద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలో సిద్దార్థ్ నటించి మంచి గుర్తింపు పొందాడు.