Siddharth clarifies about Pushpa 2 controversy:
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. హిందీ బెల్ట్‌లో ఈ సినిమా అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. అయితే, తమిళ నటుడు సిద్దార్థ్ ఈ చిత్రంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సిద్దార్థ్ తన తాజా చిత్రం మిస్ యూ ను పుష్ప 2 తో ఒకే తేదీకి విడుదల చేయాలని ముందుగా భావించారు. అయితే, విడుదలకు ముందే పుష్ప 2 గురించి అనవసరమైన కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
మొదట, పెద్ద సినిమా కాబట్టి పుష్ప 2 వాయిదా వేయాలని సూచించారు. ఇటీవల, హిందీ బెల్ట్‌లో పుష్ప 2 ఈవెంట్‌కు వచ్చిన భారీ జనసందోహం గురించి ఒక జర్నలిస్ట్ ప్రస్తావించగా, సిద్దార్థ్ మాట్లాడుతూ, “ఇండియాలో రోడ్డు పక్కన జెసిబీలు నిలిపితే కూడా ఇలాంటి జనాలు వస్తారు,” అంటూ విమర్శించారు.
Q: You have compared #Pushpa2TheRule crowd with JCB. Is there any issue with #AlluArjun❓#Siddharth: #Pushpa2 got Big success. My wishes to them. There is no personal vengeance on Anyone. Theatre is also filled with crowd i hope, it’s a positive sign pic.twitter.com/uG9Rj89I8h
— AmuthaBharathi (@CinemaWithAB) December 11, 2024
అలాగే, రాజకీయాల పోలికలు
సిద్దార్థ్ పుష్ప 2పై తన కామెంట్స్‌కు సంబంధం లేని రాజకీయ ఉదాహరణలు కూడా ఇచ్చారు. “పోలిటిషియన్స్ పెద్దసంఖ్యలో ప్రజల్ని బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి రప్పిస్తారు” అంటూ విమర్శించారు. ఈ కామెంట్లపై తమిళ మీడియా సిద్దార్థ్‌ను ప్రశ్నించగా, ఆయన అల్లు అర్జున్ పట్ల ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పారు.
గత వ్యాఖ్యల గురించి మాత్రం సిద్ధార్థ్ క్లారిటీ ఇవ్వకుండా వదిలేశారు. సిద్దార్థ్ తన తాజా వ్యాఖ్యల్లో పుష్ప 2 థియేటర్లు నిండడంపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఆయన గత వ్యాఖ్యలు మాత్రం. ప్రశ్నార్థకంగా మారి ఫ్యాన్స్ కి చిరాకు తెప్పిస్తున్నాయి. సిద్ధార్థ్ దీని గురించి ఇంకా క్లారిటీ ఇస్తారా లేక ఇలానే వివాదాస్పదంగా వదిలేస్తారా వేచి చూడాలి.
ALSO READ: Manchu కుటుంబంలో ఆస్తి గొడవలు? అసలు Mohan Babu ఆస్తి విలువ ఎంతంటే!