భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై నటుడు సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమర్శలు వస్తుండటంతో సిద్ధార్థ్ తప్పు తెలుసుకున్నాడు. సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖను విడుదల చేశాడు. ‘డియర్ సైనా.. నా ట్వీట్ ద్వారా చేసిన రూడ్ జోక్‌కి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. మిమ్మల్ని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు.
నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఆ విషయంలో సారీ. నా ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం. నా ట్వీట్‌లో జెండర్‌కు సంబంధించిన విషయాలేవీ లేవు. నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నా’ అంటూ విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు నువ్వు ఎప్పుడూ నా చాంపియన్‌గా ఉంటావు సైనా.. అంటూ సిద్ధార్థ్ లేఖలో పేర్కొన్నాడు.
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సమయంలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై.. ‘దేశ ప్రధానికే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిణామాల్ని ఖండిస్తున్నా’ అంటూ సైనా ట్వీట్ చేయగా.. దీనిపై హీరో సిద్ధార్థ్ వ్యంగంగా బదులిస్తూ..’ఓ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ ఛాంపియన్’ అంటూ సైనాపై అభ్యంతరకర రీతిలో సిద్ధార్థ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY
— Siddharth (@Actor_Siddharth) January 11, 2022