HomeTelugu Trendingసిద్ధార్థ్ చిన్నా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

సిద్ధార్థ్ చిన్నా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Siddartha Chinna movie OTTసిద్ధార్థ్ నటించిన చిన్నా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై స‌స్పెన్స్ వీడింది. న‌వంబ‌ర్ 28 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో చిన్నా మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో రిలీజ్ అవుతోంది.

చిన్నా సినిమాలో హీరోగా నటించడమే కాకుండా ఈ మూవీని నిర్మించాడు సిద్ధార్థ. డ్రామా థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఎస్ యు అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

త‌మిళంలో చిత్తా పేరుతో సెప్టెంబ‌ర్ 28న రిలీజైంది. తెలుగులో థియేట‌ర్ల స‌మ‌స్య కార‌ణంగా వారం ఆల‌స్యంగా అక్టోబ‌ర్ 6న రిలీజ్ చేశారు.

చిన్నా సినిమా ఓటీటీలో న‌వంబ‌ర్ 17న రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ అదే రోజు చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావ‌డంతో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వెన‌క్కి త‌గ్గింది.

చిన్నా సినిమాలో సిద్ధార్థ్ నటనకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని ఈశ్వ‌ర్ అనే యువ‌కుడిపై నింద ప‌డుతుంది. ఆ నింద నుంచి అత‌డు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? క‌నిపించ‌కుండా పోయినా త‌న మేన‌కోడ‌లి ఆచూకీని ఎలా క‌నిపెట్టాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

చిన్నా సినిమా తెలుగులో పెద్ద‌గా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయినా చాలా రోజుల త‌ర్వాత చిత్తా సినిమాతో కోలీవుడ్‌లో సిద్ధార్థ్‌కు మంచి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ద‌క్కింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!