Shyamala about Prabhas Marriage:
అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నారట. ప్రభాస్ పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కానీ.. పెళ్లి గురించి నాకు వార్తలు మాత్రం ఎక్కువ అయిపోతూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ అవి నిజం కావడం లేదు.
మరోవైపు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఎప్పటికప్పుడు ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిపోయినట్లే మాట్లాడుతూ కనిపిస్తారు. ఈ మధ్యనే కల్కి సినిమా గురించి మాట్లాడుతూ.. ఎవరో ప్రభాస్ సినిమాలు ఇక హిట్ అవ్వవు అని అన్నారు.. కానీ ప్రభాస్ మళ్ళీ హిట్ కొట్టి వాళ్లకి నిరూపించారు.. పెళ్లి విషయంలో కూడా అదే జరుగుతుంది అని చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పెళ్లి బట్టల గురించే మాట్లాడారు శ్యామలాదేవి. అసలు విషయం ఏమిటంటే.. జూబ్లీహిల్స్ లోని ఒక బట్టల షాపు ఓపెనింగ్ కి శ్యామల దేవి కూడా వెళ్లారు. షాపు గురించి మాట్లాడుతూ.. “ప్రభాస్ పెళ్లి బట్టలు ఇక్కడే కొంటాం” అని అన్నారు. ఆమెకి కంచి పట్టు చీరలంటే చాలా ఇష్టమని, అక్కడ అన్ని రకాల వెరైటీ చీరలు దొరుకుతున్నాయి అని షాపు గురించి పబ్లిసిటీ ఇచ్చారు.
ఏదేమైనా ప్రభాస్ పెళ్లితో లింకు చేసి మాట్లాడడంతో.. అసలు ఆ బట్టల షాపు ఏంటి అని.. ఎక్కడ ఉంది అని ఫాన్స్ వెతికేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ అభిమానులు మాత్రం అసలు ప్రభాస్ పెళ్లి జరిగే పనేనా.. అని కూడా కామెంట్లు చేస్తున్నారు.
More about Prabhas:
ఇక సినిమాల పరంగా చూస్తే.. ప్రభాస్ ఈ మధ్యనే కల్కి 2898 AD సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలానే సినిమాలు ఉన్నాయి. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లో సెట్స్ మీదకు వెళ్లనుంది. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా కథలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు.
మరోవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా ఉంది. మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా కూడా చేయాల్సి ఉంది. ఇక సలార్, కల్కి సినిమాలకి రెండవ భాగాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో కూడా ప్రభాస్ బిజీగా ఉన్నారు.