HomeTelugu Trendingశ్యామ్ సింగరాయ్ -2 పవన్ తోనే తీస్తా: రాహుల్ సాంకృత్యాన్

శ్యామ్ సింగరాయ్ -2 పవన్ తోనే తీస్తా: రాహుల్ సాంకృత్యాన్

Shyam singha roy director i
టాలీవుడ్‌లో టాక్సీవాలా సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు రాహుల్ సాంకృత్యాన్. ఈ సినిమా భారీ విజయాన్ని అదనుకోవడంతో నాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ నేడు విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్యామ్ సింగరాయ్ .. ఒక సాధారణ బెంగాలీ యువకుడు.. ఒక నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది కథ.. ఈ కథ నాని కంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ సూట్ అవుతుందని, ఒరిజినల్ గా నాయకుడిగా పవన్ ఎలా ఉన్నాడు అనేది శ్యామ్ సింగరాయ్ అలాగే ఉందని పవన్ ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇదే విషయాన్నీ రాహుల్ వద్ద ప్రస్తావిస్తే.. ఆయన చెప్పిన మాటలు ఆసక్తిని రేపుతున్నాయి. ‘ పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం .. ఆయనను డైరెక్ట్ చేయాలనీ నాకు ఉంది.. ఆయన ఒప్పుకొంటే శ్యామ్ సింగరాయ్ -2 పవన్ తోనే తీస్తా’ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఒక పవర్ ఫుల్ కథ .. పవన్ కనుక చేస్తే పవన్ ఫ్యాన్స్ రచ్చ మూమూలుగా ఉండదు అని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ వార్తలు పవన్ వరకు వెళ్తే ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu