samantha chennai story: శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘సలార్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. త్వరలో అడివి శేష్ తో కలిసి హిందీ-తెలుగు ప్రాజెక్ట్ డెకాయిట్ లో నటించనుంది.
ఈ క్రమంలో మరో ఛాన్స్ కొట్టేసింది. చెన్నై స్టోరీ మూవీ టీమ్ శృతి హాసన్ ప్రధాన పాత్ర కోసం తీసుకుంది. నిజానికి నవంబర్ 2021 లో, స్టార్ హీరోయిన్ సమంత ఇండో-బ్రిటీష్ ప్రాజెక్ట్ కోసం డౌన్‌టౌన్ అబ్బే దర్శకుడు ఫిలిప్ జాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించింది. అయితే సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో ఈ ఛాన్స్ శృతి హాసన్‌కు వచ్చింది.
తాజాగా ఈ సినిమా లో వివేక్ కల్రాతో పాటు శృతిహాసన్ కూడా నటిస్తున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది. చెన్నై స్టోరీ వేల్స్‌తో పాటు ఇండియాలో జరిగిన ఓ రొమాంటిక్ కామెడీ స్టోరీ. అను అనే ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో శృతి నటించనుంది. బాఫ్టా విజేత ఫిలిప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి నిమ్మి సహ రచయిత.
ఈ మూవీ ముఖ్యంగా ఇంగ్లీష్, కొద్దిగా తమిళం, వెల్ష్ తో కూడి ఉంటుంది. ఈ ఇంగ్లిష్ మూవీ టైమ్రీ ఎన్ మురారి రాసిన, 2004లో అత్యధికంగా అమ్ముడైన నవల ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ కి తెరరూపం. సునీత తాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని శృతి తెలిపింది.
చెన్నైకి చెందిన ఈ కథ తనకెంతో ప్రత్యేకమని, ఫిల్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, అంతర్జాతీయ భాగస్వామ్యం ద్వారా పాతుకుపోయిన కథలను చెప్పడమే సినిమా మేకింగ్ అని ఆమె అన్నారు. బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన యూకే గ్లోబల్ స్క్రీన్ ఫండ్ కూడా ఈ చిత్రాన్ని సపోర్ట్ చేస్తోంది.
ఓ ఏజెన్సీని నడుపుతున్న ద్విలింగ సంపర్క తమిళ మహిళ కథే ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’. ఒక వెల్ష్-ఇండియన్ వ్యక్తి కనిపించకుండా పోయిన తన తండ్రిని కనుగొనే ప్రయత్నంలో ఉంటాడు. అతనికి సహాయం చేసే డిటెక్టివ్ పాత్రలో శ్రుతి నటించనుండగా, తండ్రిని వెతికే వ్యక్తిగా వివేక్ నటించనున్నాడు. అను పాత్ర కోసం సమంత ఆడిషన్స్ చేసిందని, అయితే ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడంతో ఆమె లేకుండానే ముందుకు వెళ్లాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.