టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ శృతి హాసన్. కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తండ్రి పేరును ఎక్కడ కూడా వాడుకోకుండానే సొంతగా నిరూపించుకుంది. నటిగానే కాకుండా మ్యూజిక్ కంపోజర్ గా, సింగర్‌గా కూడా శృతి ప్రతిభ చాటిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ లాక్డౌన్ లో షూటింగ్స్ లేకపోవడంతో ఈ అమ్మడు సంగీతంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా శృతి ‘ఎడ్జ్’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేసింది. అందులో ‘టేక్ మి టేక్ మి టు ఎడ్జ్..’ అనే సాంగ్‌ను విడుదల చేసింది. ప్రతి ఒక్కరిలో అసంపూర్ణమైన ప్రేమను తెలియజేప్పే ప్రయత్నమే ఇది అని శృతి తెలిపింది. ఈ ఆల్బమ్‌కు శృతిహాసన్ సంగీతం సమకూర్చడంతో స్వయంగా పాడింది. ఇప్పుడు ఈ పాట ఆకట్టుకుంటుంది.