HomeTelugu Trendingతెలుగు మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: శ్రుతిహాసన్

తెలుగు మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: శ్రుతిహాసన్

Shruti clarify on Gabbar Si
సౌత్ ఇండస్ట్రీలో కమర్షియల్ చిత్రాల్లో నటించడంపై తాను చేసిన వ్యాఖ్యలను తెలుగుమీడియా తప్పుగా అర్థంచేసుకుందంటోంది శ్రుతి హాసన్. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చింది. అయితే తన కెరీర్‌లో హిట్ అందించిన గబ్బర్‌సింగ్, రేసుగుర్రం సినిమాల గురించి తాను మాట్లాడినట్లు అపార్థంచేసుకుని కొన్ని వెబ్‌సైట్లు తప్పుగా రాసినట్లు ఆమె పేర్కొంది. వాళ్లు రాసిన వార్తల్లో నిజం లేదు. రేసు గుర్రం, గబ్బర్ సింగ్ సినిమాల్లో నటించడాన్ని నేను ఎప్పటికీ గొప్పగా భావిస్తాను. పవన్‌ కల్యాణ్‌తో నటించిన గబ్బర్‌సింగ్ నా కెరీర్‌నే మార్చేసింది. తెలుగుతో పాటు దక్షిణాది చిత్రాల్లో నటించడం అంటే నేను నా హృదయానికి దగ్గరగా ఉండటమే అంటోంది శ్రుతి. నేను నటించిన హిందీ సినిమాలను ఉద్దేశించీ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడాను. భారత చిత్ర పరిశ్రమలో సౌత్ వర్సెస్ హిందీ అనడం నాకు ఏమాత్రం నచ్చదు అంటోంది. ఇప్పుడైనా నన్నుపూర్తిగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అంటోంది శ్రుతిహాసన్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu